ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్లో తనిఖీలు
- June 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, అబుదాబీలో గల పోర్ట్ జాయెద్ ఏరియాలోని మార్కెట్లో తనిఖీలు నిర్వహించింది. మినిస్ట్రీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. షాప్ కీపర్స్తో ఈ సందర్భంగా మాట్లాడిన హషీమ్ అల్ నౌమి, మార్కెట్ స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే మినిస్ట్రీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ని సంప్రదించి, ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మినిస్ట్రీ సూచన మేరకు అన్ని షాప్లు మినిస్ట్రీ ఆమోదించిన లేబుల్స్ని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ధరల పెరుగుదల తగ్గుదలపై ఎప్పటికప్పుడు మినిస్ట్రీ అన్ని విషయాల్నీ పరిశీలిస్తోందని, మార్కెట్ స్థితిగతుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఎలాంటి పరిస్థితులూ ఇక్కడ కన్పించలేదని అల్ నౌమి తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







