‘ఇండియన్ 2’ రన్ టైమ్ లాక్ అయ్యింది.!

- July 05, 2024 , by Maagulf
‘ఇండియన్ 2’ రన్ టైమ్ లాక్ అయ్యింది.!

శంకర్ దర్శకత్వంలో వస్తున్న కమల్ హాసన్ నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘ఇండియన్ 2’. దాదాపు 30 ఏళ్ల తర్వాత సేనాపతిగా ఈ సినిమాతో మళ్లీ రాబోతున్నారు కమల్ హాసన్. 30 ఏళ్ల కిందట వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో  ఓ పెద్ద సంచలనం.

మళ్లీ అలాంటి సంచలనాలకు ఏమాత్రం మించకుండా వస్తున్నదే ‘భారతీయుడు 2’. ఈ సారి ఈ సినిమాలో సిద్ధార్ధ, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ వంటి నటీ నటులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో ఆల్రెడీ శంకర్ అండ్ కో మార్కులు కొట్టేశారు. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే రిలీజైన ప్రబాస్ ‘కల్కి’, ఇంతవరకూ సాధించిన రికార్డుల్ని ఈ సినిమా కొల్లగొట్టేయనుందని అంచనా వేస్తున్నారు.

సోషల్ మెసేజ్‌తో కూడి, ఉన్నతమైన నిర్మాణ విలువలతో రూపొందిన చిత్రమిది. ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు ఈ మధ్య కమల్ హాసన్. అదే హైప్‌ని ఈ సినిమాతో అంతకు మించి అనేలా కంటిన్యూ చేయబోతున్నారనడానికి ఉదాహరణగా వుంది ట్రైలర్‌లో ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్. ట్రైలరే ఆ రేంజ్‌లో వుంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో వుండబోతోందో.!

అన్నట్లు తాజాగా ఈ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. 3 గంటల 4 నిముషాల లాంగ్ రన్‌టైమ్‌తో సినిమాని ముగించారు. ఇంత లాంగ్ రన్ టైమ్ వుందంటే సినిమాలోని పట్టు, పదును ఏ స్థాయిలో వున్నాయో కదా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com