ఒక్క డ్రోన్‌తో 22 విమానాలకు ఝలక్‌

- June 13, 2016 , by Maagulf
ఒక్క డ్రోన్‌తో 22 విమానాలకు ఝలక్‌




దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 69 నిమిషాల పాటు తాత్కాలికంగా మూసివేయడంతో మొత్తం 22 విమానాల్ని డైవర్ట్‌ చేయాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిథి తెలిపారు. ఓ డ్రోన్‌ కారణంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఈ సమస్య వచ్చిపడింది. ఇటీవలి కాలంలో ఎయిర్‌పోర్ట్‌ని తాత్కాలికంగా మూసివేయడం ఇది కేవలం రెండో సారి మాత్రమే కావడం గమనార్హం. చాలాకాలంగా ఎయిర్‌పోర్ట్‌కి ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందనీ, నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఒక్కోసారి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనీ, సాంకేతిక సమస్యలతోనూ డ్రోన్లు గతి తప్పుతున్నాయని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు వివరించాయి. డ్రోన్లు వినియోగించాలనుకునేవారెవరైనా ముందుగా జనరల్‌ సివిల్‌ యావియేషన్‌ అథారిటీ (జిసిఎఎ) ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతించిన జోన్లలో కేవలం 5 కిలోల బరువున్న డ్రోన్లను మాత్రమే వినియోగానికి వీలుంది. ఏదన్నా వస్తువుని విడిచిపెట్టేలా డ్రోన్లను విడినియోగించరాదు. వీడియోలు లేదా ఫొటోల్ని డ్రోన్లతో చిత్రీకరించకూడదు. గ్రౌండ్‌ లెవల్‌ నుంచి కేవలం 400 అడుగుల ఎత్తువరకే డ్రోన్లను వినియోగించాలి. వాతావరణ పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు అది కూడా పగటి పూట మాత్రమే ద్రోన్లను ఎగురవేయాలి. సరదా కోసం తప్ప, వాణిజ్య అవసరాల కోసం డ్ల్రోను వినియోగించకూడదు. ఎయిర్‌ ఫీల్డ్స్‌, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సైట్స్‌, ఎయిర్‌పోర్ట్‌ ఔటర్‌ ఫెన్స్‌ తదితర ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల వినియోగం నిషేధం. 25 కేజీల పైబి డ్రోన్లను వినియోగించడానికి కనీస వయసు 21 ఏళ్ళు. వినియోగదారుడికి డ్రోన్‌కీ మధ్య డైరెక్ట్‌ రేడియో లింక్‌ ఉండాలి. ఇవన్నీ డ్రోన్లకు సంబంధించిన నిబంధనలు. వీటిని ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com