మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలేస్తారా.?

- July 06, 2024 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలేస్తారా.?

చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నా.. రాజకీయం తనకు దూరంగా లేదంటూ ‘గాడ్ ఫాదర్’ సినిమలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్ ఒకటుంటుంది. అదీ నిజమే.

ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా వుండి, సినిమాల్లో బిజీ అయిపోయారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకా, చిరంజీవి రాజకీయాల ప్రస్థావన కూడా తెరపైకి వచ్చింది.

చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి రాబోతోందనీ, కాదు కాదు గవర్నర్ అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో చిరంజీవి ఇకపై సినిమాలకు బ్రేక్ తీసుకుంటారంటూ ఇంకో ప్రచారం జోరందుకుంది.

అయితే, కేంద్ర మంత్రిగా వుండి కూడా సినిమాలు చేయొచ్చు. కానీ, గవర్నర్ పదవిలో వుంటే సినిమాలు చేయడం కుదరకపోవచ్చు. మరి, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ప్రస్తుతం చిరంజీవి ఒప్పుకున్న ప్రాజెక్టుల్లో ‘విశ్వంభర’ షూటింగ్ త్వరలో పూర్తి కాబోతోంది.

అలాగే పలువురు డైరెక్టర్లు చిరంజీవి కోసం కథలు సిద్ధం చేసుకుని కాచుక్కూర్చున్న సంగతి తెలిసిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com