ఎయిర్ ఆసియా వారి 'బిగ్ సేల్'
- June 13, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా రెండో వార్షికోత్సవం సందర్భంగా 'బిగ్ సేల్' పేరుతో తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. అన్ని రుసుములతో కలిసి దేశీయంగా టిక్కెట్ ప్రారంభ ధర రూ.799గా ప్రకటించింది. 2017 జనవరి4 నుంచి 2017 ఆగస్టు 21లోపు ప్రయాణించాలనుకునే వారు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేల్ కింద ఈ నెల 19 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ ఆఫర్ కింద పలు రూట్లలో విమాన టిక్కెట్ల ధరల్ని ఎయిర్ ఏషియా ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం...
* గువాహటి-ఇంఫాల్ : రూ.799 * బెంగళూరు-కొచ్చి : రూ.899 * బెంగళూరు-పూనె : రూ.1,099 * దిల్లీ-బెంగళూరు : రూ.2,699 * విశాఖపట్నం-బెంగళూరు : రూ..1,199 అంతర్జాతీయంగా కొన్ని రూట్లకూ ఈ ఆఫర్ కింద తగ్గింపు ఛార్జీల్ని సంస్థ ప్రకటించింది. ఆఫర్లో టిక్కెట్ ప్రారంభ ధర రూ.3,399. కొచ్చి-కౌలాలంపూర్ టిక్కెట్ ధర రూ.3,399.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









