భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త రామ్ బుక్సానీ కన్నుమూత
- July 08, 2024
దుబాయ్: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డాక్టర్ రామ్ బుక్సానీ దుబాయ్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 83. ఆదివారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తన ఇంట్లో ఆయన మరణించారు. తన 18 సంవత్సరాల వయస్సులో నవంబర్ 1959లో దుబాయ్‌లో అడుగుపెట్టాడు. అనంతరం అంచలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
డాక్టర్ బుక్సాని వివిధ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జుమేరా (దుబాయ్) అధ్యక్షుడిగా, ఇండియన్ హైస్కూల్ ఛైర్మన్‌గా సేవలు అందించారు. 1953లో ఇంటర్నేషనల్ ట్రేడర్స్ (ఈస్ట్ ఆఫ్రికా)ని స్థాపించారు. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడర్స్ (ME) లిమిటెడ్ అని పేరు మార్చారు. కాస్మోస్ మొదటి షోరూమ్ 1969లో దీరాలో ప్రారంభమైంది. అనంతరం డాక్టర్ బక్సాని గ్రూప్ ఆతిథ్య రంగంలోకి ప్రవేశించింది. అంబాసిడర్ హోటల్, దీరా మరియు ఆస్టోరియా హోటల్లో వాటాలను కొనుగోలు చేసింది. ITL కాస్మోస్ గ్రూప్ తరువాత F&B రంగంలోకి ప్రవేశించి క్వాలిటీ ఐస్ క్రీమ్‌ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









