అమెరికాలో ఆడిషన్స్ చేసిన డైరెక్టర్ VN ఆదిత్య
- July 08, 2024
మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట.. లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు VN ఆదిత్య. త్వరలో ఆయన నుంచి మరిన్ని సినిమాలు రానున్నాయి. ఆల్రెడీ సినిమా పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. త్వరలో VN ఆదిత్య మరో కొత్త సినిమా తీయబోతున్నారు. తాజాగా ఆ సినిమాకి సంబంధించి అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించారు.
ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా VN ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ డల్లాస్ లోనే జరగనుందని VN ఆదిత్య తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవ్వనుంది.
అయితే తాజాగా ఈ సినిమా కోసం ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించింది. ఈ ఆడిషన్స్ కి ప్రవాస భారతీయులు మాత్రమే కాక అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్.. ఇలా వేరే దేశాల కొత్త నటీనటులు కూడా ఆడిషన్స్ కి వచ్చారు. ఇలా బయటి దేశాల వాళ్ళు కూడా ఆడిషన్స్ కి రావడంతో దర్శకుడు వీఎన్ ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. ఈసారి VN ఆదిత్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!







