* సఖీ *

- June 13, 2016 , by Maagulf

నవ్వుతావు
ఎందుకో   తెలియదు
బంతి పూలన్నీ తీసుకొస్తావు

ఎగురుతావు
ఎక్కడికో తెలియదు
జ్ఞాపకాల రెక్కల్లో గాలి నింపుకుంటావు

సీతాకోక చిలుకువై
రంగుల కలలు మోసుకొస్తావు
రెక్కలతో కనురెప్పల జోకొట్టిపోతావు

ఇటు
వాలిపోతున్న పొద్దు

అటు
వాడిపోతున్న దిక్కు

సఖీ !

బాధకెందుకో  బంగారుపూత పూస్తావు
చిరునవ్వుతో

పారువెల్ల
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com