వైఎస్సార్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా కనిపించరు: షర్మిల

- July 09, 2024 , by Maagulf
వైఎస్సార్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా కనిపించరు: షర్మిల

మంగళగరి: మంగళగరిలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.వైఎస్ఆర్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి అన్న షర్మిల.. వైఎస్సార్ వారసులం అని చెబుతున్న వారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజల కోసం ప్రతిక్షణం పరితపించిన సీఎం వైఎస్సార్ అని షర్మిల అన్నారు. దేవుడి దయతో ఇంత మంచిని ప్రజల కోసం చేసే అవకాశం కలిగిందని వైఎస్సార్ చివరి రోజుల్లో చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.

అధికారం.. అనుభవించటం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమేనని వైఎస్సార్ నమ్మారని షర్మిల వెల్లడించారు. గెలిచిన వెంటనే ఐదేళ్ల సమయం ఉన్నా.. ప్రజల కోసం వెళ్లి వైఎస్ఆర్ మనకి దూరమయ్యారు అని షర్మిల ఎమోషన్ అయ్యారు.

”వైఎస్సార్ లాంటి సీఎం మనకి భూతద్దంలో వెతికినా కనిపించరు. రెండోసారి గెలిచినప్పుడు మెజార్టీ తగ్గటంతో ప్రజలు అంతగా మీ అంతగా మిమ్మల్ని ప్రేమించలేదు అంటే నవ్వి ఊరుకున్నారు. వైఎస్సార్ చనిపోయిన రోజే ఆయనపై ప్రజలకున్న ప్రేమ ఎంతో అర్థమైంది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే దేశానికి మంచిదని ఎప్పుడో గుర్తించారు వైఎస్సార్. రాహుల్ ని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అని షర్మిల అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com