స్పెర్మ్ కౌంట్‌కి ఈ ఆహార పదార్ధాలు దివ్వౌషధాలు.!
- July 09, 2024
పీసీఓడీ తదితర సంతానోత్పత్తి సమస్యలు కేవలం స్త్రీలలోనే కాదు పురుషుల్లోనూ కొన్ని సమస్యలు చూస్తుంటాం. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలంటే స్పెర్మ్ కౌంట్.
ప్రస్తుతం జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలు, ఒత్తిడి, కొన్ని రకాల మానసిక రుగ్మతలు పురుషుల్లో సంతానోత్పత్తి స్థాయిని తగ్గించేస్తున్నాయ్.
అయితే, పురుషుల్లో సంతానోత్పత్పిని ప్రభావితం చేసే స్పెర్మ్ కౌంట్ సమస్యలు రాకుండా వుండాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తమ డైట్‌లో చేర్చుకోవడం తప్పనసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచివి. అయితే, వీటిలోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పురుషుల్లో వీర్య కణాల వృద్ధికి తోడ్పడతాయ్.
అలాగే, వీర్య కణాల వృద్ధిలో బాదం పప్పుది అత్యంత కీలక స్థానంగా చెబుతున్నారు. బాదం పప్పులోని సెలీనియం, జింక్, విటమిన్ ఇ.. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ దెబ్బ తినకుండా సాయపడుతుంది.
అందుకే ప్రతీ రోజూ పురుషులు ముఖ్యంగా యుక్త వయసు నుంచి పెళ్లి వయసుకు దగ్గరవుతున్న పురుషులు ప్రతీ రోజూ బాదం పప్పులు తమ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే సీ ఫుడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుంటాయ్. సముద్రపు చేపలు, రొయ్యలు వంటి వాటిని తరచూ తీసుకుంటే వీర్య కణాల వృద్ధి బాగుంటుంది.
అలాగే, రెగ్యులర్‌గా వంటల్లో వాడుకునే టమోటాలకు కూడా వీర్య కణాలను వృద్ధి చేసే సామర్ధ్యం చాలా ఎక్కువని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







