కష్టాలలో కాంతా రావు కుటుంబం

- June 13, 2016 , by Maagulf
కష్టాలలో కాంతా రావు కుటుంబం

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ఈయనే కత్తి కాంతారావు అంటారు. తెలుగు ఇండస్ట్రీలో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు వచ్చింది ఈయనకే..అంతే కాదు ఎన్టీఆర్ మెచ్చిన నటుడు కూడా కాంతారావు కావడం విశేషం. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. కాంతారావు 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. ఇక ఇండస్ట్రీలో విఠలాచార్య, కాంతారావు కాంబినేషన్ అంటే అప్పట్లో భలే క్రేజ్ ఉండేది.
మాయలు..మంత్రాలు, దెయ్యాలు వాటితో పోరాటాలు అప్పట్లోనే చాలా వరకు గ్రాఫిక్స్ ఉపయోగించి చిత్రాలు తీశారు. అందుకే కాంతారావు అప్పట్లో గండర గండడు,కత్తి కాంతారావు అని పిలిచే వారు.
ఒక్క నటుడిగానే కాకుండా సప్తస్వరాలు (1969),గండర గండడు (1969),ప్రేమ జీవులు (1971),గుండెలు తీసిన మొనగాడు (1974),స్వాతి చినుకులు (1989) చిత్రాలు కూడా నిర్మించారు. అయితే వీటిలో ఒకటి రెండు బాగా హిట్ అయిన చిత్రాలుగా ఉన్నా మిగిలినివి చాలా నష్టాల్లోకి తీసుకు వెళ్లాయి. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చారు. తోటి నటులు ఆర్థికంగా బాగా సెటిల్ అయినా కాంతా రావు మాత్రం కాలేక పోయారు. ఒక దశలో చెప్పాలంటే ఆయన చివరిరోజుల్లో చాలా దుర్భర పరిస్థితిలో జీవించినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటారు.
కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులో ని యశోద హాస్పిటల్ లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు. ఇప్పుడు కాంతారావు ఫ్యామిలీ చాలా దీనావస్థలో ఉంది. ఆర్థికంగా చాలా దీనావస్థలో కాంతారావుగారి కుటుంబం ఉంది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రముఖ లాయర్, నటుడు నరసింహారావు, కాంతారావు ఫ్యామిలీని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com