గల్ఫ్ మార్కెట్స్ డీలా
- June 14, 2016
మిడిల్ ఈస్ట్ స్టాక్ మార్కెట్స్‌లో నిన్న పతనం కనిపించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మళ్ళీ డౌన్ ఫాల్ మొదలవడంతో ఈ పరిస్థితులు చోటు చేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సౌదీ అరేబియాకి చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ షేర్లు మాత్రం పుంజుకున్నాయి. సౌదీ ఎకనమిక్ రిఫార్మ్ ప్లాన్‌తో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలియవస్తోంది. బహ్రెయిన్ ఇండెక్స్ 0.3 శాతం తగ్గుదలతో 1,116 పాయింట్ల వద్ద స్థిరపడింది. దర్ అల్ అర్కాన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ 7.5 శాతం వృద్ధి సాధించింది. గత వారం 20 శాతం పెరుగుదల నమోదు చేసింది. రియాద్ స్టాక్ ఇండెక్స్‌పై పెట్రో కమెకిల్ సెక్టార్ తీవ్ర ప్రభావం చూపించింది. 0.6 శాతం తగ్గుదల నమోదయ్యింది. సైది బేసిక్ ఇండస్ట్రీస్ 1.2 శాతం నష్టాన్ని చవిచూశాయి. గత వారంలో మంచి దూకుడు ప్రదర్శించిన దుబాయ్ ఇండెక్స్ కూడా ఈసారి 1 శాతం లాస్‌తో 3,336 పాయింట్లతో సరిపెట్టుకుంది. అబుదాబీ మెయిన్ ఇండెక్స్ 0.3 పాయింట్లు తగ్గింది. ఈజిప్ట్‌లో బాగా ట్రేడ్ అయ్యే స్టాక్ ఏరాస్కామ్ టెలికామ్ మీడియా 5. శాతం తగ్గుదల నమోదు చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









