పార్కుల్లో సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్
- June 14, 2016
రస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీ కమ్యూనిటీ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ (ఆర్‌ఎల్‌ఐసి - సిఓపి), సోలార్ పవర్డ్ ఛార్జింగ్ స్టేషన్స్‌ని మొబైల్ ఫోన్స్ కోసం ఏర్పాటు చేసేందుకు అల్ షమాల్ మునిసిపాలిటీకి సహకరించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోలార్ పవర్‌తో పనిచేసే లైటింగ్ వ్యవస్థని కూడా రెండు బీచ్‌లలో ఏర్పాటు చేయనుంది. అల్ షమ్మాల్ మునిసిపాలిటీలో ఎన్విరాన్‌మెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మరియు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 10 సోలార్ ఛార్జింగ్ స్టేషన్లను అల్ రువైస్, అఐన్ సినామ్ మరియు అబు దలౌఫ్ పబ్లిక్ పార్కుల్లో ఏర్పాటు చేస్తారు. అలాగే 34 షేడెడ్ ఏరియాల్లో సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. అబు దలౌఫ్ మరియు రువైసి బీచ్‌లలో వీటిని ఏర్పాటు చేయతలపెట్టారు. 'సోలార్ మల్టీ ఫంక్షన్ ఛార్జింగ్ ట్రీ' పేరుతో సోలార్ పవర్డ్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లను రూపొందిస్తున్నారు. దీనికి రెండు లైట్ పోల్స్ ఉంటాయి. ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా వెలుగునిస్తాయివి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







