రోడ్లపై రాడార్‌ లిమిట్‌ మార్పు

- June 14, 2016 , by Maagulf
రోడ్లపై రాడార్‌ లిమిట్‌ మార్పు

షార్జా పోలీసులు రోడ్లపై సరికొత్త స్పీడ్‌ లిమిట్‌ని నిర్ణయించారు. ఖోర్‌ ఫక్కాన్‌ రోడ్లపై ఈ కొత్త స్పీడ్‌ లిమిట్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇకనుంచి 101 కిలోమీటర్ల వేగం దాటితే, రోడ్లపై ఏర్పాటు చేసిన రాడార్లు ఆ వాహనాల్ని పసిగడతాయనీ, అతి వేగంతో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని ట్రాఫిక్‌ పోలీసు అధికారులు వెల్లడించారు. ఈస్టర్న్‌ రీజియన్‌ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ మొహమ్మద్‌ ఖల్‌ఫాన్‌ అల్‌ కింది మాట్లాడుతూ, ఈ కొత్త విధానంతో వాహన ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. ఎమిరేట్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో కొన్ని రోడ్లపై వాహన వేగాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామనీ, వాటిల్లో భాగంగానే రాడార్‌ లిమిట్‌ని తగ్గించినట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com