పారిస్ లో ఉగ్రవాద దాడి ఇద్దరు మృతి

- June 14, 2016 , by Maagulf
పారిస్ లో ఉగ్రవాద దాడి ఇద్దరు మృతి

పారిస్‌లోని మాగ్నావిల్‌ ప్రాంతంలో ఐఎస్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దుండగుడి కాల్పుల్లో పోలీస్‌ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడింది తామేనని ఘటన అనంతరం ఐఎస్‌ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్‌ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com