కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై నేడే తుది నిర్ణయం
- June 14, 2016
లక్షలాది మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగుల రేయింబవళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఏడవ వేతన సంఘ సిఫారసులను ఎప్పటినుంచి అమలుచేస్తారో నేడు(సోమవారం) నిర్ణయం ప్రకటించనున్నారు. జూన్ 11న తీసుకోవాల్సిన చెల్లింపుల నిర్ణయం జూన్ 14కు వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రకటించడానికి కార్యదర్శుల సాధికారిక కమిటీ అధినేత కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశ అనంతరం 47 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనం, 52లక్షల పెన్షనర్ల జీతాల పెంపుపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
ఏడవ వేతన సంఘం సిపారసులను విశ్లేషించడానికి స్క్రీనింగ్ కమిటీని కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఏర్పాటుచేసింది.
ఈ ప్యానెల్ కు అధినేతగా కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాను కేంద్రప్రభుత్వం నియమించింది. వివరణాత్మకంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడవ వేతన సంఘ సిపారసులన ఈ కమిటీ విశ్లేషించింది. కార్యదర్శుల సాధికారిక కమిటీ ఏడవ వేతన సంఘ సిపారసులపై తుది నిర్ణయం ప్రకటిస్తే.. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ కొన్ని రోజుల్లోనే అమలుచేయనుంది. ఏడవ వేతన సంఘం ప్రకారం గరిష్ట జీతం రూ.2,50,000, కనిష్ట జీతం రూ.18,000గా ఉండనుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







