ఔట్ డోర్ కార్మికులకు ఊరట
- June 14, 2016
ఖతార్ వ్యాప్తంగా ఔట్ డోర్‌లో పనిచేసే కార్మికుల కోసం పని వేళల్లో మార్పులు చేయనున్నారు. జూన్ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. సుమారు 75 రోజులపాటు ఔట్ డోర్‌లో పనిచేసే కార్మికులకు ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పని చేయకుండా వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మినిస్టీరియల్ ఇన్‌స్ట్రక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇదిలా ఉండగా, మినిస్ట్రీ ఇన్‌స్ట్రక్షన్స్ రాకుండానే కొన్ని సంస్థలు ఇప్పటికే ఈ టైమింగ్స్‌ని అమల్లోకి తెచ్చాయి. పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిన ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్ట్ సన్ లైట్‌లో పని చేయడం కార్మికులకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం 11 గంటలకే ఉద్యోగులకు విరామం ప్రకటిస్తున్నాయి కొన్ని సంస్థలు. మధ్యాహ్న వేళల్లో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, ఔట్ డోర్ పనిని వాతావరణం చల్లబడిన తర్వాత, రాత్రి వేళల్లో ఎక్కువగా చేపడుతున్నాయ పలు సంస్థలు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







