దీపికా అంటే ఆ మాత్రం వుండాలి మరి.!

- July 10, 2024 , by Maagulf
దీపికా అంటే ఆ మాత్రం వుండాలి మరి.!

స్పెషల్ ఫోటో షూట్లు అనేవి ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయ్. సామాన్యులు సైతం తమ తమ జీవితాల్లోని ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకమైన ఫోటో షూట్లు చేయించుకుంటూ చిరకాల జ్ఞాపకాలుగా పదిలపరుచుకుంటున్న సంగతి తెలిసిందే.

సామాన్యులకే అలా వుంటే, ఏకంగా స్టార్ హీరోయిన్.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె ఇంకెంత చేయాలి మరి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ‘కల్కి’ సినిమా ప్రమోషన్లలో ప్రెగ్నెంట్‌గానే తెగ సందడి చేసింది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది దీపికా పదుకొనె.

ఇక, ఇప్పుడు సినిమాలకు కాస్త విరామమిచ్చి స్పెషల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటో షూట్ కోసం ఏకంగా లక్షా 92 వేల రూపాయల ఖరీదైన చీరను డిజైన్ చేయించుకుంది. అలాగే 3 లక్షల విలువ చేసే ఆభరణాలను ధరించింది. చాలా కాస్ట్‌లీ కదా. అందుకే ఈ  ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com