భోగాపురం విమానాశ్రయం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- July 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ గ్రోత్ ఇంజిన్ లా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో పోర్టులు కూడా ఉన్నాయని, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అంతా కలిసిపోతుందని చెప్పారు. శ్రీకాకుళం నుండి వైజాగ్ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 31.8 శాతం ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 45 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారని అంచనా వేశారు. రోడ్ల కనెక్టివిటీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేశారు. జీఎంఆర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో విమానాశ్రయ నిర్మాణ పనులపై ప్రజంటేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







