కేజ్రీవాల్‌కి ఊరట..మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- July 12, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌లో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదించారు. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా…ఈ పిటిషన్‌ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్లోనే ఉండక తప్పదు. ఇదే కేసులో ఆయనను సీబీఐ విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 90 రోజుల పాటు కేజ్రీవాల్ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







