ఆగస్టు 2న విడుదల కానున్న ‘ఉషా పరిణయం’
- July 13, 2024
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన కె. విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ రాబోతోంది.ఉషా పరిణయం అనే టైటిల్‌తో ఫ్యామిలి ఎంటర్టైనర్ను విడుదలకు సిద్దం చేశారు. ఈ చిత్రాన్ని విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీకమల్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయి పరిచయం కాబోతోంది. ఆగస్టు 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ’సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది. సినిమా లవర్స్‌కు ఇదొక విందు భోజనంలా ఉంటుంది”అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







