ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ నియామకం
- July 13, 2024
అమరావతి: ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముకేశ్ కుమార్ మీనా అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారన్న ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన స్థానంలో కొత్త సీఈవోగా నియమితులైన వివేక్ యాదవ్ మొన్నటి వరకు సీఆర్డీయే కమిషనర్గా పనిచేశారు. రెండు రోజుల క్రితం యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అంతలోనే ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మరోవైపు, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారులతోపాటు భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గురువారంనాడు కూడా పలువురు అధికారులను ఏపీ సర్కారు బదిలీ చేసింది. ఏపీలో గురువారం 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్.పి. సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







