300 దిర్హామ్‌ల జరిమానా..640 ఈ-స్కూటర్లు సీజ్

- July 14, 2024 , by Maagulf
300 దిర్హామ్‌ల జరిమానా..640 ఈ-స్కూటర్లు సీజ్

దుబాయ్: ఈ నెలలో దుబాయ్ పోలీసులు 640 సైకిళ్లు, ఈ-స్కూటర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఓవర్‌స్పీడ్, నిర్దేశించని ప్రాంతాలలో రైడింగ్, ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా రైడింగ్, సేఫ్టీ గేర్ మరియు హెల్మెట్ ధరించకుండా ఉండటం వంటి వివిధ ఉల్లంఘనలను నమోదు  చేసినట్టు మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ వెల్లడించారు. ఇ-స్కూటర్‌లు 60కిమీ కంటే ఎక్కువ వేగ పరిమితితో నడపడం చేస్తే 300 దిర్హామ్‌ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.  ఇతరులకు ప్రమాదం కలిగించే బైక్‌ను నడపడానికి300 దిర్హామ్‌లు, ఈ-స్కూటర్‌పై ప్రయాణీకులను తీసుకెళ్లడం 300 దిర్హామ్‌లు, ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇ-స్కూటర్ లేదా సైకిల్ తొక్కడం చేస్తే 200 దిర్హామ్ జరిమానా ఉంటుందని గుర్తుచేశారు. దుబాయ్ పోలీస్ యాప్‌లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వి ఆర్ ఆల్ పోలీస్' సేవకు కాల్ చేయడం ద్వారా రోడ్డుపై ఏవైనా ప్రమాదకరమైన ప్రవర్తనలు ఉంటే తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.

2024 ప్రథమార్థంలో ఇ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారని, 25మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు చెప్పారు.  2024 మొదటి ఆరు నెలల్లో 7,800 కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా, అధికారులు 4,474 ఇ-స్కూటర్లు మరియు సైకిళ్లను సీజ్ చేశారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com