జాయెద్ రోడ్లో డ్రైవర్ ను రక్షించిన పోలీసులు
- July 15, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే హైవేపై ఊహించని విధంగా వాహనం క్రూయిజ్ అదుపుతప్పింది. అయితే, సదరు వాహన డ్రైవర్‌ను పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది రక్షించాయి. షేక్ జాయెద్ రోడ్డులో అబుదాబి వైపు ప్రయాణిస్తున్నప్పుడు అతని వాహనం ఫెయిల్ అయింది. వెంటనే డ్రైవర్ అత్యవసర నంబర్ 999కి కాల్ చేశాడు. కేవలం నిమిషాల వ్యవధిలో డ్రైవర్ వాహనాన్ని పోలీసు పెట్రోలింగ్ టీమ్ చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ఇలాంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండాలని, తప్పనిసరిగా తమ సీటుబెల్ట్‌ను బిగించి, హజార్డ్ లైట్లు మరియు హెడ్లైట్లను ఆన్ చేసి, వెంటనే 999ని సంప్రదించాలని ట్రాఫిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సేలం బిన్ సువైదాన్ చెప్పారు.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







