అంజలి ఏదో మ్యాజిక్ చేసేలానే వుందిగా.!
- July 15, 2024
వెండి తెరపై తెలుగమ్మాయ్ అంజలి హవా ఎలా వున్నప్పటికీ, ఓటీటీ తెరపై మాత్రం బీభత్సంగా వుందనిపిస్తోంది. ఈ పాటికే మూడు వెబ్ సిరీస్‌లతో తనదైన హవా చూపించింది అంజలి ఓటీటీలో.
తాజాగా ‘బహిష్కరణ’ అనే మరో వెబ్ సిరీస్‌తో వస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో అంజలి స్టన్నింగ్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. టీజర్‌తో పాటూ, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‌కి నాగార్జున మద్దతు కూడా లభించింది.
ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. రీసెంట్‌గా అంజలి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటించిన వేశ్య పాత్రే ఈ సిరీస్‌లోనూ పోషించింది. కానీ, ఆ సినిమాలో తేలిపోయిన ఆ పాత్ర సిరీస్‌లో ఏదో మ్యాజిక్ చేయబోతోందని తెలుస్తోంది.
‘పుష్ప’ అనే పల్లెటూరి అమ్మాయి కమ్ వేశ్య పాత్రలో అంజలి నటించిన ఈ ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి జీ 5 ఓటీటీ ఛానెల్‌లో స్ర్టీమింగ్ కానుంది. ఇంతవరకూ రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో భారీగా హైప్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ అంజలికి ఎంత మేర పేరు తీసుకొస్తుందో చూడాలిక.
ఖచ్చితంగా ప్రతీ అమ్మాయి చూడదగ్గ వెబ్ సిరీస్‌గా చెబుతున్న ఈ సిరీస్‌లో అనన్య నాగళ్ల, శ్రీ తేజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







