అమ్మోరు తల్లిగా త్రిష.! ట్విస్ట్ ఏంటంటే.!
- July 15, 2024
అప్పుడెప్పుడో ఆర్జీ బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ సినిమా గుర్తే వుంటుంది. నయన తార అమ్మోరు తల్లిగా నటించిన సినిమా అది. ఆధ్యంతం వినోదం పంచుతూనే దేవుడు, భక్తి.. అనే పద్ధతిపై ఆలోచించదగ్గ ఓ మెసేజ్ అందించిన సినిమా అది.
తమిళ సినిమానే అయినా తెలుగులోనూ అమ్మోరు తల్లి అనే నేటివిటీ బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో, మంచి ఆదరణ దక్కింది. కోవిడ్ టైమ్‌లో ఓటీటీలో రిలీజయ్యింది ఈ సినిమా.
ఇక, ఈ సినిమాకి ఎప్పటి నుంచో సీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారు. కానీ, కుదరడం లేదు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ నయన తారే కానీ, దర్శకుడు మాత్రం మారిపోయాడు.
కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆర్జీ బాలాజీ చేతిలోంచి జారిపోయిందని తెలుస్తోంది. కానీ, ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచన అనేది ఆయనదే కావడంతో, అదే సినిమాకి ‘అమ్మోరు తల్లి 2’ పేరుతో తానే సీక్వెల్ రూపొందిస్తున్నారట. అయితే, అమ్మోరు తల్లి పాత్రలో నయన తారకు బదులు త్రిష నటిస్తోందనీ సమాచారం.
త్రిష ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. వాటితో పాటూ ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీ కూడా ఆమె లిస్టులో చేరిపోయిందన్న మాట.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







