డిఫరెంట్ షేడ్స్ వున్నాయ్ ఈ కుర్రోడిలో.! కానీ.!

- July 15, 2024 , by Maagulf
డిఫరెంట్ షేడ్స్ వున్నాయ్ ఈ కుర్రోడిలో.! కానీ.!

యంగ్ హీరో నరేష్ అగస్త్యకు పరిచయం అక్కర్లేదు. పక్కా తెలంగాణా తెలుగు కుర్రోడు. మంచి టాలెంట్ వున్నోడు కూడా. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

ఆ తర్వాత  ‘సేనాపతి’, ‘మోడ్రన్ లవ్ హైద్రాబాద్’ ‘పంచతంత్రం’, ‘మెన్‌టూ’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా ఓటీటీలో ‘కిస్మత్’, ‘పరువు’ అనే సినిమాల్లోనూ సెటిల్డ్ పర్‌ఫామెన్స్‌తో అలరించాడీ కుర్ర హీరో.

తాజాగా ‘#మాయ లో’ అనే సినిమాలో నటించాడు. రీసెంట్‌గా ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోందీ సినిమా. ఈ సినిమాలో నరేష్ అగస్త్య పర్‌ఫామెన్స్‌కి దాసోహం అంటున్నారు ఓటీటీ జనం.

డిఫరెంట్ వేరియేషన్స్ వున్న నటనలో నరేష్ అగస్త్య ఆకట్టుకున్నాడు. ఎక్కువ మంది క్యారెక్టర్స్ లేరు. హీరోకి తెగ ఎలివేషన్లూ లేవు. బ్యూటిఫుల్ లవ్ జర్నీగా సాగే ఈ సినిమా ఇచ్చిన సందేశం సింప్లీ సూపర్బ్ అనిపించింది. నిజానికి ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలు బోర్ కొట్టించేస్తుంటాయ్.

కానీ, నరేష్ అగస్త్య తనదైన నటనతో కట్టి పడేశాడు. వీలైతే ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహా వేదికగా ఈ సినిమాని వీక్షించొచ్చు. టీ టైమ్ బ్రేక్ మూవీ.. హాయిగా చూసి ఆనందించొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com