తాప్సీకి వేరే పనేం లేదా.? ఇదేం బుద్ధట.!

- July 15, 2024 , by Maagulf
తాప్సీకి వేరే పనేం లేదా.? ఇదేం బుద్ధట.!

అందాల భామ తాప్సీకి నోటి దురుసు కాస్త ఎక్కువే. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ, తెలుగులో ఓ మోస్తరు స్టార్‌డమ్ అందుకున్నాకా, బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారడంతో, తెలుగు నాట పలువురు ప్రముఖులను తనదైన నోటి దురుసుతో ఆడి పోసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పిందనుకోండి. అయినా కానీ, తాప్సీ నోటికి హద్దూ అదుపూ వుండదు. ఏ విషయంలో ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అర్ధం కాని అందాల బొమ్మే తాప్సీ.

తాజాగా వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్స్‌లో ఒకరైన అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవంలో ఎందరో మహానుభావులు, ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ సినీ ప్రుమఖులు ఈ వేడుకకు ఘనంగా హాజరయ్యారు. అలాగే తాప్సీకి కూడా ఆహ్వానం అందిందట. కానీ, తాప్సీ హాజరు కాలేదట. అందుకు తనదైన రీజన్ చెప్పుకొచ్చింది తాప్సీ.

ఆతిధ్యం ఇచ్చే వ్యక్తికీ అతిథి తో ఓ విధమైన అనుబంధం వుండాలి.. నాకు అంబానీ అంటే ఎవరో తెలీదు.. అందుకే నేను ఈ వివాహానికి హాజరు కాలేదంటూ నెట్టింట్లో రెస్పాండ్ అయ్యింది. అయితే, తాప్సీ మాటలకు నెటిజన్లు మరోలా స్పందిస్తున్నారు. అసలు ఆహ్వానమే అందలేదు కాబోలు.. అందుకే ఇలా భుజాలు తడుముకుంటోంది తాప్సీ.. అని.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com