కేదార్‌నాథ్‌లో 228 కిలోల బంగారం మాయమైంది.. స్వామి కీలక వ్యాఖ్యలు

- July 15, 2024 , by Maagulf
కేదార్‌నాథ్‌లో 228 కిలోల బంగారం మాయమైంది.. స్వామి కీలక వ్యాఖ్యలు

జ్యోతిర్‌మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని చెప్పారు. 228 కిలోల బంగారం కనిపించడం లేదని అన్నారు.

దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. కాగా.. ఢిల్లీలో కేథార్‌నాథ్ ఆలయం నిర్మాణానికి జులై 10న శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో ఆలయ నిర్మాణం పట్ల నిరసన తెలుపుతూ అవిముక్తేశ్వరానంద ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు.. శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతోశ్రీలో కలిశారు. పూజా కార్యక్రమం కోసం ఆయన ఠాక్రే ఇంటికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే నమ్మకద్రోహానికి గురయ్యారన్నారు. దీని గురించి తనకు చాలా బాధగా ఉందని.. తనతో పాటు మరికొందరు కూడా చాలా బాధపడుతున్నారని.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజల ఈ దుఃఖం తీరదన్నారు.

ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం చేశారు.. ఈ బాధ చాలా మంది మనసుల్లో ఉందన్నారు. ఈ రోజు తాము అతని కోరికపై ఇక్కడకు వచ్చామని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. ద్రోహం చేసేవాడు హిందువు కాలేడు, సహించేవాడు హిందువు అవుతాడని చెప్పారు. మొత్తం మహారాష్ట్ర ప్రజలు ఈ విషయంతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మనస్సులో ఈ బాధ ఉందని పేర్కొన్నారు. ఎన్నికలలో కూడా ఈ విషయం వెల్లడైంది. ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం చేశాడని మహారాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఇప్పుడు రుజువైందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com