వందరోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నరోబో 2.0
- June 14, 2016
రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో రెండు ప్రధాన యాక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్ ను తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ తోను, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోను క్లైమాక్స్ సీన్లు తీసినట్లు చెప్పాడు. ఈ వంద రోజుల ప్రయాణం చక్కగా సాగిందని వివరించారు.దాదాపు 50 శాతం సినిమా పూర్తయిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు. కాగా, మార్చి 21న అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ లో హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యుసర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







