భారత రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్

- July 17, 2024 , by Maagulf
భారత రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులకు ఖలిస్తానీ ప్లాట్‌పై సమాచారం రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం విషయంలో ఖలిస్తానీ సంస్థలు పెద్ద కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి. ఆగస్టు 15న ఢిల్లీలోని పలు చోట్ల ఖలిస్తానీ నినాదాలతో కూడిన పోస్టర్లను ఈ సంస్థలు అంటించవచ్చని సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలోనే కాకుండా దేశంలో చాలాచోట్ల ఖలిస్తానీ ఘటనలు ఎక్కువయ్యాయి. ఖలిస్తానీల నెట్‌వర్క్‌పై పంజాబ్ పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లాండాకు చెందిన ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలు, నెట్‌వర్క్, పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రగ్స్ సేకరించారు. అరెస్టు అయిన ముగ్గురికి కెనడాలోని తలదాచుకున్న ఉగ్రవాది లఖ్‌బీర్ లాండాతో సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com