రాజ్ తరుణ్ డబుల్ ధమాకా.! ప్రెజెంట్ ట్రెండ్ వర్కవుట్ అయ్యేనా.!
- July 18, 2024
యంగ్ హీరో రాజ్ తరుణ్ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో. కానీ, ఇప్పుడలా కాదు. ఆయన ఫేడవుట్ హీరో. లాంగ్ గ్యాప్ తర్వాత మొన్నీ మధ్యనే ‘నా సామిరంగ’ సినిమాలో నాగార్జునకి సపోర్టింగ్ రోల్‌లో కనిపించాడు.
ఆ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు చర్చకొచ్చాయ్. అందులో రెండు సినిమాలు పూర్తయిపోవడంతో రిలీజ్‌కి కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నాయ్. అవే ‘తిరగబడరా సామీ’, ‘పురుషోత్తముడు’ సినిమాలు.
పేర్లు బాగున్నాయ్.. అంతకన్నా ముందు ఈ మధ్య రాజ్ తరుణ్.. లావణ్య అనే అమ్మాయి విషయంలో ట్రెండింగ్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. పోలీసులు, కేసులు.. అంటూ ఈ వివాదం గట్టిగానే నడుస్తోందిప్పుడు. రేపో మాపో రాజ్ తరుణ్‌ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా వున్నాయంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన సినిమాల పరిస్థితేంటీ.? ఒక్కటి కాదు ఏకంగా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ గ్యాప్‌లో రిలీజ్ కాబోతున్నాయ్.
జూలై 26న ‘పురుషోత్తముడు’ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఆగస్టు 2న ‘తిరగబడరా సామీ’ రిలీజ్ కానుంది. పెద్దగా ప్రమోషన్లు కూడా లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. అయితే, ప్రత్యేకంగా ప్రమోషన్లు దేనికి.? ఇప్పుడసలే రాజ్ తరుణ్ పేద్ద ట్రెండింగ్ పీస్ కదా అంటారా.!
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







