చికెన్‌ మిలాప్‌

- June 14, 2016 , by Maagulf
చికెన్‌ మిలాప్‌

 

కావలసినవి బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు 2 కప్పులు, బీన్స్‌ 150 గ్రా, గ్రేవీ కోసం: నూనె 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు ఒక టీ స్పూను, అల్లం ఒక టీ స్పూను, చాట్‌ మసాలా ఒక టీ స్పూను, కారం అర టీ స్పూను, పసుపు అర టీ స్పూను, గరం మసాలా పొడి అర టీ స్పూను, టొమాటో ప్యూరీ అర కప్పు, ఎండు మెంతి ఆకులు అర టీ స్పూను, చితక్కొట్టిన నల్ల మిరియాలు అర టీ స్పూను, (తరిగిన) టొమాటోలు 2, ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
చికెన్‌ ముక్కల్ని శుభ్రం చేసి ఉప్పు, కారం పట్టించి పది నిమిషాలు ఉంచాలి. బాణలిలో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి వేగించాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం సిద్ధం చేసుకున్న మిగతా వాటినన్నిటినీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయాలి. తర్వాత చికెన్‌ ముక్కల్ని వేసి కలిపి బాగా ఉడికించాలి. ఆ తర్వాత మీడియం సైజులో కట్‌ చేసిన బీన్స్‌ని కూడా వేసి మరో 7 నిమిషాలు ఉడికించాలి. దీనిని వేడి వేడిగా అన్నంతో గాని, చపాతీలతో గాని తింటే చాలా బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com