మహంకాళి బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: సజ్జనార్
- July 19, 2024
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. 175 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపనున్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, పటాన్ చెరు, ఈసీఐఎల్, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జులై 21, 22 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







