సౌదీ అరేబియాలో ఇంజినీరింగ్ ట్రేడ్ లో 25% జాతీయీకరణ..!
- July 21, 2024
రియాద్: సౌదీ అరేబియా ఆదివారం నుండి 25% ఇంజనీరింగ్ వృత్తులను జాతీయం చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ వృత్తుల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు కొత్త నిబంధన వర్తిస్తుంది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు హౌసింగ్ భాగస్వామ్యంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో సౌదీ పౌరులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు మంత్రిత్వ శాఖలు చేస్తున్న ప్రయత్నాలలో ఈ చర్య భాగంమని భావిస్తున్నారు. మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ లేబర్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని పెంచే నిర్ణయాన్ని పర్యవేక్షిస్తుంది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో జాతీయీకరణ ప్రక్రియ, వృత్తులు మరియు అవసరమైన శాతాలను వివరించే విధానపరమైన గైడ్‌ను విడుదల చేసింది. పాటించని చట్టపరమైన జరిమానాలను విడించనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







