ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- July 21, 2024
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. కాగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇదిలాఉంటే తెల్లవారు జామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు అలయ అర్చకులు నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి బోనాల పండగ సంప్రదాయం ఉందని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







