పరధ్యానంలో డ్రైవింగ్ చేస్తూ..SUVని ఢీకొట్టిన డ్రైవర్..భారీగా ఫైన్..!

- July 21, 2024 , by Maagulf
పరధ్యానంలో డ్రైవింగ్ చేస్తూ..SUVని ఢీకొట్టిన డ్రైవర్..భారీగా ఫైన్..!

యూఏఈ: అబుదాబి పోలీసుల రోడ్ కెమెరాలలో ఒక ట్రాఫిక్ ప్రమాదం దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు పంచుకున్న 31 సెకన్ల క్లిప్‌లో అతను సిగ్నల్ జంప్ చేసి మరో దిశ నుండి వస్తున్న తెల్లటి SUVని బలంగా ఢీకొట్టాడు. 

యూఏఈలో రెడ్ లైట్‌ను జంప్ అనేది తీవ్రమైన ట్రాఫిక్ నేరం.  1,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహనం సీజ్ చేస్తారు. అబుదాబిలో వాహనదారులు తమ వాహనాలను విడిపించు కోవడానికి  50,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల్లోగా జరిమానా చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేస్తారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే జరిమానా కింద 800 దిర్హామ్‌లు మరియు 4 ట్రాఫిక్ పాయింట్‌లు విడిస్తారని అధికారులు పేర్కొన్నారు.

చౌరస్తాలో ఆగేటప్పుడు వాహనదారులు ట్రాఫిక్‌ లైట్‌పై దృష్టి పెట్టాలని గుర్తు పోలీసులు చేశారు. డ్రైవింగ్‌లో ఫోన్‌లు ఉపయోగించవద్దని డ్రైవర్లను కోరారు. డ్రైవింగ్ ను నిర్లక్ష్యం చేయడం వలన ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించవచ్చు, తరచుగా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించవచ్చని తెలిపారు.ఇటీవలి నివేదిక ప్రకారం ఎమిరేట్స్ లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల సంభవిస్తున్నాయి. వాహనదారుల 'దుష్ప్రవర్తన' కారణంగా మరణాలు 3 శాతం పెరిగాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) 2023కి సంబంధించి రోడ్డు భద్రత గణాంకాలపై ఇటీవల అప్‌లోడ్ చేసిన 'ఓపెన్ డేటా' ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com