'బై నౌ పే లేటర్'.. అధిక స్పందన..!

- July 22, 2024 , by Maagulf
\'బై నౌ పే లేటర్\'.. అధిక స్పందన..!

దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ఆమోదించిన.. ఇటీవల ప్రారంభించిన బై నౌ పే లేటర్ (BNPL) సేవ  టెస్టింగ్ దశలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన చూసింది. ఇది  భారీ మార్కెట్ ప్రయోజనాలకు సూచన అని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. BNPL అనేది ఖతార్‌లో మూడు నెలల వ్యవధిలో దుకాణదారులకు నాలుగు వాయిదాలలో చెల్లించడానికి అనుమతిస్తుంది. వస్తువులు మరియు సేవలను తక్షణమే కొనుగోలు చేయడానికి వీలు కల్పించే ఒక పరిష్కారంగా భావిస్తున్నారు. సున్నా వడ్డీ లేదా రుసుములతో, షరియా-కంప్లైంట్ ఫైనాన్షియల్ మోడల్ ప్రపంచంలోనే అగ్రగామి చెల్లింపు విధానాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు మరియు కస్టమర్‌లను ఆకర్షిస్తోంది.

QCB ఏప్రిల్‌లో ఐదు కంపెనీలను ఆమోదించింది. అవి: Spendwisor Inc., Qaiver FinTech LLC, HSAB ఫర్ పేమెంట్ సొల్యూషన్స్, మిహురు LLC మరియు PayLater వెబ్‌సైట్ సర్వీసెస్, BNPL మొదటి దశలో అనుమతించారు.టెస్టింగ్ పీరియడ్ దశ జూలై 17న ప్రారంభమైంది.  ఇది కనీసం మూడు నెలల పాటు కొనసాగనుంది.

స్పెండ్‌వైజర్ సహ-వ్యవస్థాపకుడు అయిన సఫరుద్దీన్ ఫరూక్ మాట్లాడుతూ..QCB నుండి అనుమతితో పరీక్ష దశలో తమ కంపెనీకి భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. స్పెండ్‌వైజర్ లులు హైపర్ మార్కెట్‌లు, పీపుల్స్ టెలికాం ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో మొదటిసారిగా BNPLని ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com