రాత్రివేళ ఔట్ డోర్ పనిపై కన్‌స్ట్రక్షన్ వర్కర్ల ఆసక్తి
- June 14, 2016
మధ్యాహ్న సమయంలోనే కాకుండా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో సూర్యాస్తమయం తర్వాత పనిచేయడానికే ఔట్ డోర్‌లో పనిచేసే నిర్మాణ రంగ కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మిడ్ డే బ్రేక్ ఉన్నప్పటికీ, ఈ మూడున్నర గంటల్లో వేడిమిని తప్పించుకున్నా, అంతకు ముందు ఆ తర్వాత వేడి తమకు ఇబ్బందికరంగానే ఉందని వారు తెలిపారు. ఉదయం వేళల్లో కన్నా సూర్యాస్తమయం తర్వాత చేసే పని పట్ల ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారనీ, ఆ సమయంలో పని కూడా వేగంగా జరుగుతోందని, కొన్ని సంస్థలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు పని దినాల్ని చేపట్టి విజయం సాధించాయని కన్‌స్ట్రక్షన్ రంగానికి చెందిన సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. చాలా వరకు కార్మికులు రాత్రి వేళ పనిచేయడానికి నిరాకరించడంలేదు. షెల్టర్ నీడన పనిచేయాల్సి వచ్చినా వేడి ప్రభావంతో పని సామర్థ్యం తగ్గుతోందని నిపుణులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







