‘ఇండియన్ 2’ అప్పుడే ఓటీటీలోకి.!
- July 23, 2024
ధియేటర్లలో రిలీజ్ అయ్యాకా రెండు నెలల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం కావల్సి వుంది ఏ సినిమా అయినా. ఇదీ రూల్. కానీ, ఈ మధ్య కొన్ని సినిమాలు ఈ రూల్‌ని పాటించడం లేదు.
ధియేటర్లలో మంచి టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే ఆ రూల్ పక్కాగా వర్తిస్తోంది. ఓ మోస్తరు టాక్ లేదా, డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలు రెండు వారాల నుంచి నాలుగు వారాలలోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయ్.
తాజాగా భారీ అంచనాల నడుమ రిలీజైన సినిమా ‘భారతీయుడు 2’. సెన్సేషనల్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందిన సినిమా కావడం, శంకర్ టేకింగ్ అండ్ మేకింగ్ గురించి తెలియడం వల్ల.. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.
అయితే, సినిమాకి టాక్ అంతంత మాత్రమే అయ్యేసరికి ఈ సినిమాని త్వరలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
‘భారతీయుడు 2’ సినిమాకి అంతకన్నా మంచి డేట్ ఇంకేముంటుందిలే. అయితే ధియేటర్లలో ఆకట్టుకోని ఈ సినిమాని ఓటీటీ ప్రేక్షకులనయినా ఆకట్టుకుంటందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!







