మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా.?
- July 23, 2024
‘గాడ్ ఫాదర్’ సినిమాతో తనకిష్టమైన డైరెక్టర్లలో ఒకరైన మోహన్ రాజాకి మెగాస్టార్ చిరంజీవి అవకాశమిచ్చారు. ‘గాడ్ ఫాదర్’ రీమేక్ మూవీనే అయినప్పటికీ చిరంజీవిని ఆ సినిమాలో చూపించిన విధానం ఆకట్టుకుంది. మరీ ఎక్కువ అంచనాలకు పోయపోయినప్పటికీ చిరంజీవి రేంజ్కి ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫర్వాలేదనిపించింది.
అది రీమేక్ మూవీ కావడంతో ఓ స్ర్టెయిట్ మూవీకి కూడా మరోసారి మోహన్ రాజాతో కలిసి పని చేయాలని, అప్పుడే ఆయనకి మాటిచ్చారట చిరంజీవి. చిరంజీవి మాటిస్తే అంతే.! ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఎక్కువ టైమ్ కూడా తీసుకోరు అందుకోసం.
అలా మోహన్ రాజాకి మళ్లీ టైమొచ్చింది. చిరంజీవితో కలిసి పని చేసే అవకాశమొచ్చింది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కోసం అద్భుతమైన స్టోరీ ప్రిపేర్ చేశారట మోహన్ రాజా. స్ర్కిప్టు వర్క్ కంప్లీట్ అయిపోయిందనీ తెలుస్తోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారట. అలాగే, ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బహుశా ఈ సినిమా పూర్తి కాగానే మోహన్ రాజా సినిమానే పట్టాలెక్కించనున్నారేమో చిరంజీవి. చూడాలి మరి.
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







