లవర్ బాయ్ తరుణ్ మళ్లీ వస్తున్నాడా.?

- July 23, 2024 , by Maagulf
లవర్ బాయ్ తరుణ్ మళ్లీ వస్తున్నాడా.?

ఒకప్పుడు అమ్మాయిల హృదయాల్లో గూడు కట్టుకున్న హీరో తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు వారందరికీ సుపరిచితుడైన ఈ చిట్టి పొట్టి కుర్రోడు హీరోగా తొలి సినిమా ‘నువ్వే కావాలి’తో సంచలనాలు సృష్టించాడు.

తర్వాత కూడా కొంత కాలం పాటు ఇండస్ర్టీలో యంగ్ హీరోగా యూత్‌ స్టార్‌గా లవర్ బాయ్‌గా తన ఇమేజ్‌ని బాగానే కాపాడుకున్నాడు కానీ, ప్రేమ పేరు చెప్పి కెరీర్‌ని డ్యామేజ్ చేసుకున్నాడు.

దాంతో ఆల్రెడీ కొంత గ్యాప్ తీసుకుని ‘శశిరేఖా పరిణయం’ అంటూ గతంలో ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కానీ, లాభం లేకపోయింది. ఇప్పుడు మరోసారి థర్డ్ ఇన్నింగ్స్‌తో రాబోతున్నానని స్వయంగా తరుణే చెప్పాడు.

ఇటీవలే క్రికెట్ లీగ్‌కి సంబంధించిన ఓ కార్యక్రమంలో తరుణ్ స్వయంగా తన రీ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు. తన చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయనీ, అందులో ఒకటి సినిమా కాగా, ఇంకోటి వెబ్ సిరీస్ అనీ చెప్పాడు.

అయితే, వాటి వివరాలు చెప్పలేదు. త్వరలోనే వాటి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్టు చెప్పాడు. ఏది ఏమైతేనేం, లవర్ బాయ్ మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నాడన్న మాట.

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ బాగా వున్న తరుణం కావడంతో వెండితెరపై సీన్ లేకపోయినా, ఓటీటీ తెరపై తమ టాలెంట్‌ని తిరిగి ప్రూవ్ చేసుకునే అవకాశం మెండుగా లభిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com