ఖాన్ యూనిస్‌పై దాడిలో 89 మంది మృతి
- July 23, 2024
గాజా: దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయిల్ మెరుపుదాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.
వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ అధికారులతో సమన్వయంతో గాజా నగరానికి ప్రయాణిస్తున్న స్పష్టంగా గుర్తించిన యుఎన్ కాన్వాయ్‌పై ఇజ్రాయిల్ సైన్యం దాడి జరిపింది. ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 39,006 మంది పాలస్తీనియన్లు మరణించగా, 89,818 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







