పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ పూర్తి షెడ్యూల్.. టైమ్‌తో సహా పూర్తి వివరాలివే..

- July 24, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ పూర్తి షెడ్యూల్.. టైమ్‌తో సహా పూర్తి వివరాలివే..

అతిపెద్ద క్రీడా సంబరానికి పారిస్‌ సిద్ధమవుతోంది. జులై 26 నుంచి 2024 సమ్మర్‌ ఒలింపిక్స్‌కి తెరలేవనుంది. ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో 117 మంది భారత అథ్లెట్లు పోటీ పడుతున్నారు.

వీరిలో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. జులై 26న జరిగే ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రగ్బీ సెవెన్స్‌, ఫుట్‌బాల్ (గ్రూప్ స్టేజ్), ఆర్చరీలో ర్యాంకింగ్ రౌండ్స్‌ వంటి కొన్ని ఈవెంట్‌లు ముందుగా ప్రారంభమవుతాయి. భారతదేశం తన ఒలింపిక్ జర్నీని జులై 25న ఇండివిడ్యువల్‌ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్‌తో ప్రారంభించనుంది. ఆగస్టు 11న మహిళల 76 కేజీల ఈవెంట్‌లో రీతికా హుడా బరిలో దిగడంతో భారత్‌ పోరాటం ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా ఫుల్ షెడ్యూల్, ఏ రోజు ఏ ఈవెంట్‌లో మన అథ్లెట్లు పోటీ పడతారో చూద్దాం.

* జులై 25, గురువారం
ఆర్చరీ - మహిళల ఇండివిడ్యువల్‌ ర్యాంకింగ్ రౌండ్ (దీపికా కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్) - మధ్యాహ్నం 1 గం
ఆర్చరీ - పురుషుల ఇండివిడ్యువల్‌ ర్యాంకింగ్ రౌండ్ (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్)- సాయంత్రం 5:45

* జులై 26, శుక్రవారం
ప్రారంభోత్సవం - రాత్రి 11:30గం

* జులై 27, శనివారం
బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు), పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి), మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - 12 గం నుంచి

రోయింగ్- పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్) - మధ్యాహ్నం 12:30 నుంచి

షూటింగ్ - 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:30

షూటింగ్ - 10 మీ ఎయిర్ పిస్టల్ మెన్స్‌ క్వాలిఫికేషన్‌(సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా) - మధ్యాహ్నం 2 గం.

షూటింగ్ - 10 మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్స్‌ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2 గం.

టెన్నిస్ - 1వ రౌండ్ మ్యాచ్‌లు - పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్.శ్రీరామ్ బాలాజీ) - మధ్యాహ్నం 3:30 నుంచి

షూటింగ్ - 10 మీ ఎయిర్ పిస్టల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రిథమ్ సాంగ్వాన్, మను భాకర్)- సాయంత్రం 4 గంటల నుంచి

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్) & మహిళల సింగిల్స్ (మణికా బాత్రా, శ్రీజ అకుల) ప్రిలిమినరీ రౌండ్ - సాయంత్రం 6:30 నుంచి

బాక్సింగ్- మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్), రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 7 గంటల తర్వాత

హాకీ - పురుషుల గ్రూప్ B - భారత్ v న్యూజిలాండ్ - రాత్రి 9 గం

* జులై 28, ఆదివారం
బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు), పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి), మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 నుంచి

షూటింగ్ - 10 మీ ఎయిర్ రైఫిల్ మహిళల అర్హత (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:45 నుంచి

ఆర్చరీ - మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్) - మధ్యాహ్నం 1 గం.

షూటింగ్ - 10 మీ ఎయిర్ పిస్టల్ మెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ (బల్రాజ్ పన్వార్) - మధ్యాహ్నం 1:06 నుంచి

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్) & మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ అకుల) రౌండ్ ఆఫ్ 64 - మధ్యాహ్నం 1:30 గం.

బాక్సింగ్ - పురుషుల 51 కిలోల (అమిత్ పంఘల్) రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 2:30 గం (మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుంది)

స్విమ్మింగ్ - పురుషుల 100 మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) - మధ్యాహ్నం 2:30 గం. నుంచి

స్విమ్మింగ్ - మహిళల 200 మీ ఫ్రీస్టైల్ హీట్స్ (ధినిధి దేశింగు) - మధ్యాహ్నం 2:30 గం. నుంచి

షూటింగ్ - 10 మీ ఎయిర్ రైఫిల్ మెన్స్‌ క్వాలిఫికేషన్‌ (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా) - మధ్యాహ్నం 2:45 గం. నుంచి

బాక్సింగ్ - పురుషుల 71 కిలోల (నిషాంత్ దేవ్) రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 3:02 గం. నుంచి

షూటింగ్ - 10 మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 3:30 గం. నుంచి

టెన్నిస్ - 1వ రౌండ్ మ్యాచ్‌లు - పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) - మధ్యాహ్నం 3:30 గం. నుంచి

బాక్సింగ్ - మహిళల 50 కిలోల (నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 4:06 గం. నుంచి

ఆర్చరీ - మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:45 గం. నుంచి

ఆర్చరీ - మహిళల టీమ్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:17 గం.

ఆర్చరీ - మహిళల టీమ్‌ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా ) - రాత్రి 8:18 గం.

ఆర్చరీ - మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా ) - రాత్రి 8:41 గం.

స్విమ్మింగ్ - పురుషుల 100 మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా ) - అర్ధరాత్రి 1:02 గం. నుంచి

స్విమ్మింగ్ - మహిళల 200 మీ ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:20 నుంచి

* జులై 29, సోమవారం
బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు), పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి), మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గం. నుంచి

షూటింగ్ - ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్) - మధ్యాహ్నం 12:30 గం. నుంచి

షూటింగ్ - 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా, మను భాకర్, రిథమ్ సాంగ్వాన్) - మధ్యాహ్నం 12:45 గం. నుంచి

షూటింగ్ - 10మీ ఎయిర్ రైఫిల్ ఉమెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం నుంచి.

ఆర్చరీ- పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్)- మధ్యాహ్నం 1 గం. నుంచి

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ E/F - మధ్యాహ్నం 1 గం. నుంచి

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్) & మహిళల సింగిల్స్ (మణికా బాత్రా, శ్రీజ అకుల) రౌండ్ ఆఫ్ 64 & 32 - మధ్యాహ్నం 1:30 గం. నుంచి

షూటింగ్ - 10మీ ఎయిర్ రైఫిల్ మెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 3:30 గం. నుంచి

టెన్నిస్ - 2వ రౌండ్ మ్యాచ్‌లు (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 3:30 గం. నుంచి

హాకీ - పురుషుల గ్రూప్ B - భారత్ v అర్జెంటీనా - సాయంత్రం 4:15 గం.

ఆర్చరీ - పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:45 గం. నుంచి

ఆర్చరీ - పురుషుల టీమ్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:17 గం.

ఆర్చరీ - పురుషుల టీమ్ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - రాత్రి 8:18 గం.

ఆర్చరీ - పురుషుల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - రాత్రి 8:41 గం.

స్విమ్మింగ్ - పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 12:49 గం.

స్విమ్మింగ్ - మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:11 గం.

* జులై 30, మంగళవారం
బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు), పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి), మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గం.

షూటింగ్ - ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్ తొండైమాన్) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్) & మహిళల సింగిల్స్ (మణికా బాత్రా, శ్రీజ అకుల) రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 1:30 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:40 గం.

బాక్సింగ్ - పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిడ్యువల్‌ డే 1 (అనుష్ అగర్వాలా) - మధ్యాహ్నం 2:30 గం.

ఆర్చరీ- పురుషుల ఇండివిడ్యువల్‌ (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) రౌండ్ ఆఫ్ 64, మహిళల ఇండివిడ్యువల్‌ (దీపికా కుమారి అంకితా భకత్, భజన్ కౌర్) రౌండ్ ఆఫ్ 64 - సాయంత్రం 3:30 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ 2వ రౌండ్ & పురుషుల డబుల్స్ 3వ రౌండ్ మ్యాచ్‌లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

బాక్సింగ్ - మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:50 గం.

ఆర్చరీ- 32 పురుషుల ఇండివిడ్యువల్‌ రౌండ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:15 గం.

ఆర్చరీ- మహిళల ఇండివిడ్యువల్‌ రౌండ్ 32 (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:30 గం.

బాక్సింగ్ - మహిళల 57 కేజీ (జైస్మిన్ లంబోరియా) రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 4:38 గం.

హాకీ - పురుషుల గ్రూప్ B - భారత్ v ఐర్లాండ్ - సాయంత్రం 4:45 గం.

షూటింగ్ - పురుషుల ట్రాప్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7 గం.

* జులై 31, బుధవారం
షూటింగ్ - 50మీ రైఫిల్ 3 పోస్. మెన్స్‌ క్వాలిఫికేషన్‌(ఐశ్వరీ తోమర్, స్వప్నిల్ కుసలే) - మధ్యాహ్నం 12:30 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:24 గం.

ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిడ్యువల్‌ డే 1 (అనుష్ అగర్వాలా) - మధ్యాహ్నం 1:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్) & మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజా అకుల) రౌండ్ ఆఫ్ 32 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

బాక్సింగ్ - పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 3:02 గం.

ఆర్చరీ- 64 & 32 పురుషుల ఇండివిడ్యువల్‌ రౌండ్, 64 & 32 మహిళల ఇండివిడ్యువల్‌ రౌండ్ - సాయంత్రం 3:30 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ 3వ రౌండ్ & పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

బాక్సింగ్ - మహిళల 75 కిలోల ప్రిలిమినరీ రౌండ్ (లోవ్లినా బోర్గోహైన్) - సాయంత్రం 3:34 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

షూటింగ్ - మహిళల ట్రాప్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7 గం.

* ఆగస్టు 1, గురువారం
అథ్లెటిక్స్ - పురుషుల 20 కి.మీ రేస్ వాక్ (అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరమజీత్ బిష్త్) - ఉదయం 11 గం.

బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 12 గం.

గోల్ఫ్ - పురుషుల రౌండ్ 1 (గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) - మధ్యాహ్నం 12:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 20 కి.మీ రేస్ వాక్ (ప్రియాంక గోస్వామి) - మధ్యాహ్నం 12:50 గం.

ఆర్చరీ- పురుషుల ఇండివిడ్యువల్‌ రౌండ్ 64 & 32, మహిళల ఇండివిడ్యువల్‌ రౌండ్ 64 & 32 - మధ్యాహ్నం 1 గం.

షూటింగ్ - 50 మీ రైఫిల్ 3 పొజిషిన్స్‌ మెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ SF A/B - మధ్యాహ్నం 1:20 గం.

హాకీ - పురుషుల గ్రూప్ B - భారత్ v బెల్జియం - మధ్యాహ్నం 1:30 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

బాక్సింగ్ - మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

షూటింగ్ - 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్‌ ఉమెన్స్‌ క్వాలిఫికేషన్‌ (సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్) - సాయంత్రం 3:30 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ రేస్ 1-2 (విష్ణు శరవణన్) - సాయంత్రం 3:45 గం.

బాక్సింగ్ - మహిళల 54 కిలోల క్వార్టర్‌ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:06 గం.

బ్యాడ్మింటన్ - పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:30 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ రేస్ 1-2 (నేత్ర కుమనన్) - రాత్రి 7:05 గం.

బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - రాత్రి 10 గం.

* 2 ఆగస్టు, శుక్రవారం
బ్యాడ్మింటన్ - పురుషుల డబుల్స్ & మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 12 గం.

గోల్ఫ్ - పురుషుల రౌండ్ 2 (గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - 25 మీ పిస్టల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ ప్రెసిషన్ (మను భాకర్, ఈషా సింగ్), స్కీట్ మెన్స్ క్వాలిఫికేషన్ (అనంతజీత్ సింగ్ నరుకా) - మధ్యాహ్నం 12:30 గం.

ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 - మధ్యాహ్నం 1 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ - మధ్యాహ్నం 1 గం.

షూటింగ్ - 50మీ రైఫిల్ 3 పొజిషన్స్‌ ఉమెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

జూడో - మహిళల 78+ కిలోల ప్రిలిమినరీ రౌండ్లు (తులికా మాన్) - మధ్యాహ్నం 1:30 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

షూటింగ్ - 25మీ పిస్టల్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ రాపిడ్ (మను భాకర్, ఈషా సింగ్) - మధ్యాహ్నం 3:30 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ & పురుషుల డబుల్స్ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌(అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ రేస్ 3-4 (నేత్ర కుమనన్) - సాయంత్రం 3:45 గం.

హాకీ - పురుషుల గ్రూప్ B - భారత్ v ఆస్ట్రేలియా - సాయంత్రం 4:45 గం.

ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:45 గం.

బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

బాక్సింగ్ - మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అర్హత ఆధారంగా) - రాత్రి 7 గం.

ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:01 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ రేస్ 3-4 (విష్ణు శరవణన్) - సాయంత్రం 7:05 గం.

జూడో - మహిళల 78+ కిలోల ఫైనల్ బ్లాక్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:30 గం.

ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:54 గం.

బాక్సింగ్ - పురుషుల 51 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 8:04 గం.

ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - రాత్రి 8:13 గం.

అథ్లెటిక్స్ - మహిళల 5000మీ రౌండ్ 1 (పరుల్ చౌదరి, అంకిత ధ్యాని) - రాత్రి 9:40 గం.

అథ్లెటిక్స్ - పురుషుల షాట్‌పుట్ క్వాలిఫికేషన్‌ (తజిందర్‌పాల్ సింగ్ టూర్) - రాత్రి 11:40 గం.

* ఆగస్టు 3, శనివారం
బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 12 గం.

గోల్ఫ్ - పురుషుల రౌండ్ 3 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - స్కీట్ పురుషుల అర్హత (అనంజీత్ సింగ్ నరుకా), స్కీట్ మహిళల అర్హత (మహేశ్వరి చౌహాన్) - మధ్యాహ్నం 12:30 గం.

ఆర్చరీ- మహిళల ఇండివిడ్యువల్‌ రౌండ్ 16 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

షూటింగ్ - 25 మీ పిస్టల్ మహిళల ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ - మధ్యాహ్నం 1:12 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ బ్రాంజ్‌ మెడల్ మ్యాచ్‌, పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ రేస్ 5-6 (విష్ణు శరవణన్) - సాయంత్రం 3:45 గం.

ఆర్చరీ- మహిళల ఇండివిడ్యువల్‌ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:30 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5 గం.

ఆర్చరీ - మహిళల ఇండివిడ్యువల్‌ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:22 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ రేస్ 5-6 (నేత్ర కుమనన్) - సాయంత్రం 5:55 గం.

ఆర్చరీ- మహిళల ఇండివిడ్యువల్‌ మెడల్ రౌండ్లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:03 గం.

బ్యాడ్మింటన్ - మహిళల డబుల్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

షూటింగ్ - స్కీట్ పురుషుల ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7 గం.

బాక్సింగ్ - పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7:32 గం.

బాక్సింగ్ - మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 8:04 గం.

అథ్లెటిక్స్ - పురుషుల షాట్ పుట్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:05 గం.

* ఆగస్టు 4, ఆదివారం
బ్యాడ్మింటన్ - పురుషుల & మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 12 గం.

గోల్ఫ్ - పురుషుల రౌండ్ 4 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 1 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) - మధ్యాహ్నం 12:30 గం.

ఆర్చరీ- పురుషుల ఇండివిడ్యువల్‌ రౌండ్ 16 (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

షూటింగ్ - స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (మహేశ్వరి చౌహాన్) - మధ్యాహ్నం 1 గం.

ఈక్వెస్ట్రియన్ - డ్రస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్ ఫ్రీస్టైల్ (మెడల్ ఈవెంట్) - మధ్యాహ్నం 1:30 గం.

హాకీ - పురుషుల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (పరుల్ చౌదరి) - మధ్యాహ్నం 1:35 గం.

అథ్లెటిక్స్ - పురుషుల లాంగ్ జంప్ అర్హత (జెస్విన్ ఆల్డ్రిన్) - మధ్యాహ్నం 2:30 గం.

బాక్సింగ్ - మహిళల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

బాక్సింగ్ - మహిళల 75 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 3:02 గం.

టెన్నిస్ - పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:30 గం.

బాక్సింగ్ - మహిళల 54 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:34 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ రేస్ 7-8 (విష్ణు శరవణన్) - సాయంత్రం 3:35 గం.

బాక్సింగ్ - పురుషుల 51 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:50 గం.

ఆర్చరీ- పురుషుల ఇండివిడ్యువల్‌ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:30 గం.

షూటింగ్ - 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 2 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) - సాయంత్రం 4:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5 గం.

ఆర్చరీ - పురుషుల ఇండివిడ్యువల్‌ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:22 గం.

ఆర్చరీ- పురుషుల ఇండివిడ్యువల్‌ పతక రౌండ్లు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:03 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ రేస్ 7-8 (నేత్ర కుమనన్) - సాయంత్రం 6:05 గం.

బ్యాడ్మింటన్ - పురుషుల డబుల్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

షూటింగ్ - స్కీట్ ఉమెన్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 7 గం.

* ఆగస్టు 5, సోమవారం
షూటింగ్ - స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (అనంజీత్ సింగ్ నరుకా, మహేశ్వరి చౌహాన్) - మధ్యాహ్నం 12:30 గం.

షూటింగ్ - 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మెన్స్‌ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1 గం.

బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:15 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 - మధ్యాహ్నం 1:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 400మీ రౌండ్ 1 (కిరణ్ పహల్) - సాయంత్రం 3:25 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ రేస్ 9-10 (నేత్ర కుమనన్) - సాయంత్రం 3:45 గం.

బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ రేస్ 9-10 (విష్ణు శరవణన్) - సాయంత్రం 6:10 గం.

షూటింగ్ - స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

రెజ్లింగ్ - మహిళల 68 కేజీల రౌండ్ ఆఫ్ 16 (నిషా దహియా) - సాయంత్రం 6:30 గం.

రెజ్లింగ్ - మహిళల 68 కేజీల క్వార్టర్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

అథ్లెటిక్స్ - పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (అవినాష్ సాబుల్) - రాత్రి 10:34 గం.

అథ్లెటిక్స్ - మహిళల 5000మీ ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:40 గం.

రెజ్లింగ్ - మహిళల 68 కేజీల సెమీఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:10 గం.

* ఆగస్టు 6, మంగళవారం
అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో అర్హత (నీరజ్ చోప్రా, కిషోర్ జెనా) - మధ్యాహ్నం 1:50 గం.

రెజ్లింగ్ - మహిళల 68 కేజీల రెపెచేజ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 400మీ రెపెచేజ్ రౌండ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:50 గం.

రెజ్లింగ్ - మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (వినీష్ ఫోగట్) - మధ్యాహ్నం 3 గం.

రెజ్లింగ్ - మహిళల 50 కిలోల క్వార్టర్‌ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:20 గం.

హాకీ - పురుషుల సెమీఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:30 గం/ రాత్రి 10:30 గం.

సెయిలింగ్ - మహిళల డింగీ మెడల్ రేసు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:13 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం./ రాత్రి 11:30 గం.

సెయిలింగ్ - పురుషుల డింగీ పతక రేసు (అర్హత ఆధారంగా) - సాయంత్రం 7:13 గం.

రెజ్లింగ్ - మహిళల 50 కేజీల సెమీఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 10:25 గం.

అథ్లెటిక్స్ - పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:45 గం.

రెజ్లింగ్ - మహిళల 68 కేజీల మెడల్‌ బౌట్స్‌(అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:20 గం.

అథ్లెటిక్స్ - మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:40 గం.

బాక్సింగ్ - పురుషుల 71 కేజీ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1 గం.

బాక్సింగ్ - మహిళల 50 కేజీ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:32 గం.

* ఆగస్టు 7, బుధవారం
అథ్లెటిక్స్ - మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే (సూరజ్ పన్వర్, ప్రియాంక గోస్వామి) - ఉదయం 11 గం.

గోల్ఫ్ - మహిళల రౌండ్ 1 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల & మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

అథ్లెటిక్స్ - పురుషుల హై జంప్ అర్హత (సర్వేష్ కుషారే) - మధ్యాహ్నం 1:35 గం.

అథ్లెటిక్స్ - మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 (జ్యోతి యర్రాజి) - మధ్యాహ్నం 1:45 గం.

అథ్లెటిక్స్ - మహిళల జావెలిన్ త్రో అర్హత (అన్నూ రాణి) - మధ్యాహ్నం 1:55 గం.

రెజ్లింగ్ - మహిళల 50 కేజీల రెపెచేజ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

రెజ్లింగ్ - మహిళల 53 కేజీ రౌండ్ ఆఫ్ 16 (యాంటీమ్ పంఘల్) - మధ్యాహ్నం 3 గం.

రెజ్లింగ్ - మహిళల 53 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:20 గం.

రెజ్లింగ్ - మహిళల 53 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 10:25 గం.

అథ్లెటిక్స్ - పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్‌(ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్) - రాత్రి 10:45 గం.

వెయిట్ లిఫ్టింగ్ - మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను) - రాత్రి 11 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల టీమ్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 400మీ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:15 గం.

రెజ్లింగ్ - మహిళల 50 కేజీల మెడల్‌ బౌట్స్‌(అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:20 గం.

బాక్సింగ్ - మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1 గం.

అథ్లెటిక్స్ - పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:10 గం.

* ఆగస్టు 8, గురువారం
గోల్ఫ్- మహిళల రౌండ్ 2 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 100మీ హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:05 గం.

రెజ్లింగ్ - మహిళల 53 కేజీల రెపెచేజ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

రెజ్లింగ్ - పురుషుల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అమన్ సెహ్రావత్) - మధ్యాహ్నం 3 గం.

రెజ్లింగ్ - మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అన్షు మాలిక్) - మధ్యాహ్నం 3 గం.

రెజ్లింగ్ - పురుషుల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:20 గం.

రెజ్లింగ్ - మహిళల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:20 గం.

హాకీ - పురుషుల బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 5:30 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల టీమ్ సెమీఫైనల్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం/ రాత్రి 11:30 గం.

రెజ్లింగ్ - పురుషుల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 9:45 గం.

రెజ్లింగ్ - మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 10:25 గం.

హాకీ - పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - రాత్రి 10:30 గం.

అథ్లెటిక్స్ - పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:55 గం.

రెజ్లింగ్ - మహిళల 53 కేజీల పతక పోటీలు (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:20 గం.

బాక్సింగ్ - మహిళల 75 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:32 గం.

బాక్సింగ్ - పురుషుల 51 కేజీ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:04 గం.

బాక్సింగ్ - మహిళల 54 కేజీ ఫైనల్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:21 గం.

* ఆగస్టు 9, శుక్రవారం
గోల్ఫ్ - మహిళల రౌండ్ 3 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల టీమ్ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

అథ్లెటిక్స్ - మహిళల 4x400 మీటర్ల రిలే రౌండ్ 1 (జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేశన్, విద్య రాంరాజ్, పూవమ్మ ఎంఆర్) - మధ్యాహ్నం 2:10 గం.

రెజ్లింగ్ - పురుషుల 57 కేజీల రెపెచేజ్ రౌండ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:30 గం.

అథ్లెటిక్స్ - పురుషుల 4x400 మీటర్ల రిలే రౌండ్ 1 (మహ్మద్‌ అనాస్, మహ్మద్‌ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్) - మధ్యాహ్నం 2:35 గం.

అథ్లెటిక్స్ - మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 3:35 గం.

టేబుల్ టెన్నిస్ - పురుషుల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

రెజ్లింగ్ - పురుషుల 57 కేజీల పతక పోటీలు (అర్హత ఆధారంగా) - రాత్రి 11 గం.

అథ్లెటిక్స్ - మహిళల 400 మీ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:30 గం.

అథ్లెటిక్స్ - పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:40 గం.

బాక్సింగ్ - పురుషుల 71 కేజీల ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1 గం.

బాక్సింగ్ - మహిళల 50 కిలోల ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1:17 గం.

* ఆగస్టు 10, శనివారం
గోల్ఫ్ - మహిళల రౌండ్ 4 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల టీమ్‌ బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 1:30 గం.

రెజ్లింగ్ - మహిళల 76 కేజీల రౌండ్ ఆఫ్ 16 (రీతికా హుడా) - మధ్యాహ్నం 3 గం.

రెజ్లింగ్ - మహిళల 76 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:20 గం.

టేబుల్ టెన్నిస్ - మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) - సాయంత్రం 6:30 గం.

రెజ్లింగ్ - మహిళల 76 కేజీల సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) - రాత్రి 10:25 గం.

అథ్లెటిక్స్ - పురుషుల హై జంప్ ఫైనల్ (అర్హత ఆధారంగా) రాత్రి 10:40 గం.

అథ్లెటిక్స్ - మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:10 గం.

అథ్లెటిక్స్ - మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ (అర్హత ఆధారంగా) - రాత్రి 11:15 గం.

అథ్లెటిక్స్ - పురుషుల 4x400m రిలే ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:42 గం.

అథ్లెటిక్స్ - మహిళల 4x400m రిలే ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 12:52 గం.

బాక్సింగ్ - మహిళల 57 కేజీల ఫైనల్ (అర్హత ఆధారంగా) - అర్ధరాత్రి 1 గం.

బాక్సింగ్ - మహిళల 75 కిలోల ఫైనల్ (అర్హత ఆధారంగా) - తెల్లవారు జామున 1:46 గం.

* ఆగస్టు 11, ఆదివారం
రెజ్లింగ్ - మహిళల 76 కిలోల రెపెచేజ్ రౌండ్ (అర్హత ఆధారంగా) - మధ్యాహ్నం 2:50 గం.

రెజ్లింగ్ - మహిళల 76 కేజీల మెడల్‌ బౌట్స్‌(అర్హత ఆధారంగా) - సాయంత్రం 4:50 గం.

ఒలింపిక్స్‌ ముగింపు కార్యక్రమం - రాత్రి 11:30గం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com