రాజ్ తరుణ్ సినిమాకి ఏంటీ దుస్థితి.?
- July 24, 2024
హీరో లేకుండానే సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిపోయింది. ఎంత చిత్రం కదా.! కొన్ని సందర్భాల్లో పలు కారణాల వల్ల హీరోయిన్ అటెండ్ కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరిగితే జరగొచ్చు. కానీ, సినిమా హీరో లేకుండా ఆయా సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్లూ జరిగే సందర్భాలు చూడలేదింతవరకూ.
కానీ, లేటెస్టుగా ఓ సినిమా ఫంక్షన్‌కి హీరో హాజరు కాకుండానే కానిచ్చేశారు. అదే ‘పురుషోత్తముడు’. ఈ మధ్య లావణ్య అనే అమ్మాయి కేసులో రాజ్ తరుణ్ పేరు తెగ ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాన్ సింక్‌లో తాజా మూవీ టైటిల్ వుండడం, ఈ రచ్చ జరుగుతున్న టైమ్‌లో కామ్‌గా ఈ సినిమా రిలీజ్ వుండడం ఒకింత ఆశ్చర్యంగానే వుంది.
లేటెస్ట్‌గా హీరోయిన్ హాసిని, మిగిలిన టెక్నికల్ టీమ్‌తో కలిసి హడావిడిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపించేశారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ఈ సిట్యువేషన్‌ని హ్యాండిల్ చేయడం కష్టమే అనుకున్నారో ఏమో.. సైలెంట్‌గా హడావిడిగా.. ఎటువంటి ప్రశ్నలకు తావివ్వకుండా ఫంక్షన్ మమ అనిపించేశారు.
ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో వారం రోజుల్లో మన పురుషోత్తమ హీరోగారి ఇంకో సినిమా కూడా రిలీజ్ వుంది. అదే ‘తిరగబడరా సామి’. మరి, ఆ సినిమా ప్రమోషన్ల పరిస్థితి కూడా ఇదేనేమో.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







