ఆ సీన్లు చేయడం అంజలికి కష్టం.! పుష్పకి కాదు.!

- July 24, 2024 , by Maagulf
ఆ సీన్లు చేయడం అంజలికి కష్టం.! పుష్పకి కాదు.!


తాజాగా తెలుగమ్మాయ్ అంజలి ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ ఈ తరహా పాత్రల్లో అంజలి నటించింది లేదు. ఈ మధ్యనే వరుసగా వేశ్య పాత్రలతో ప్రేక్షకులకు షాకిస్తోంది.

మొన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా.. ఇప్పుడు ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఫెయిల్యూర్ అయినా.. ‘బహిష్కరణ’ సిరీస్ మాత్రం బాగా పాపులర్ అవుతోంది ఓటీటీలో. ఈ సినిమాలో అంజలి పాత్రను డిజైన్ చేసిన విధానం నిజానికి చాలా బాగుంది.

అయితే, అక్కడక్కడా కాస్త సాగతీత సన్నివేశాలు ఒకింత విసుగు తెప్పించినప్పటికీ అంజలిలోని మరో కోణాన్ని ఈ సిరీస్ ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేశారు మేకర్లు.

ఈ సిరీస్‌ని బాగా ప్రమోట్ చేస్తోంది కూడా అంజలి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో అంజలికి కొన్ని అనుభవాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయ్. ఈ సిరీస్‌లో చాలా వరకూ ఇంటిమేట్ సీన్లున్నాయ్. ఆయా సన్నివేశాల్లో నటించినప్పుడు ఇబ్బంది కలగలేదా.? అని అడగ్గా.. అంజలికి ఆ సన్నివేశాల్లో నటించడం ఇబ్బందే.. కానీ, పుష్ప పాత్రకి మాత్రం ఇబ్బంది లేదు.. అని తెలివిగా సమాదానమిచ్చింది తెలుగమ్మాయ్.

అవును అంతలా ఆ పాత్రలో అంజలి లీనమైపోయి నటించిందన్న మాట. ఆమె మాటల్లోని అర్ధం అదే. అఫ్‌కోర్స్.! అంజలి ఏ పాత్ర పోషించినా అలాగే వుంటుంది మరి. త్వరలో ‘గేమ్ ఛేంజర్’తో రాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com