‘గేమ్ ఛేంజర్’తో ఆ లోటు తీర్చేయనున్నాడా శంకర్.!
- July 24, 2024
శంకర్ సినిమాల్లోని పాటలు వినసొంపుగానే కాదు, విజువల్ వండర్స్‌లా వుంటాయ్. అలాంటిది శంకర్ రీసెంట్ మూవీ ‘ఇండియన్ 2’లో ఆశించిన రీతిలో పాటల్లేకపోవడం ఒకింత నిరాశకు గురి చేసింది.
అయినా ఈ సినిమా ప్యాటర్న్ కంప్లీట్‌గా డిఫరెంట్. పేరుకే కమల్ హాసన్ సినిమా కానీ, కమల్ హాసన్‌ని ఏజ్డ్ అదీ నూరేళ్ల ముసలాడి గెటప్‌లో చూపించడంతో అక్కడ చేయడానికి ఏమీ లేకపోయింది. యంగ్‌స్టర్ సిద్దార్ధ అండ్ రకుల్ ప్రీత్‌పై ఓ సాంగ్ రెడీ చేసినా ఆ పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక, శంకర్ నెక్స్‌ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’తో ఆ లోటు తీర్చేయాలనుకుంటున్నాడట శంకర్. ఇది అసలే రామ్ చరణ్ సినిమా. ఇద్దరు హీరోయన్లున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో అంజలి హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ కైరా అద్వానీ. సో, ఈ సినిమాలో ఫ్యాన్స్‌కి కిర్రాకెత్తించేలా పాటలుండబోతున్నాయట.
ఏడు పాటల వరకూ ఈ సినిమాలో చొప్పించారని తెలుస్తోంది. అందులో ఆల్రెడీ ‘జరగండి..’ పాటని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ సింగిల్ సాంగ్ ఆగస్టులో వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘క్రిస్‌మస్‌కి కలుద్దాం..’ అంటూ ఈ సినిమా రిలీజ్‌పై ఆల్రెడీ చరణ్ ఓ హింట్ ఇచ్చేశాడు. డిశంబర్ 20న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వుండొచ్చని అంచనా.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







