ఒత్తిడి కారణంగా ఆ సమస్యలు తప్పవ్.!

- July 24, 2024 , by Maagulf
ఒత్తిడి కారణంగా ఆ సమస్యలు తప్పవ్.!

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అందర్నీ వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. ఒత్తిడి కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు. శారీరక సమస్య. శారీరక ఆరోగ్యంపై ఒత్తిడి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది.

ముఖ్యంగా ఒత్తిడి అనేది కార్డిసాల్ హార్మోన్‌పై చూపించే ప్రభావం కారణంగా ఆకలిలో అనేక మార్పులు రావచ్చు. అతిగా ఆకలి వేయడం, లేదా అస్సలు ఆకలి లేకపోవడం వంటివి జరగొచ్చు.

కొందరిలో ఫ్యాట్ ఎక్కువగా, షుగర్ ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలు తీసుకోవాలనిపిస్తుంది. మరికొందరిలో వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తి నిద్రలేమి సమస్య కూడా వేధించే అవకాశాలున్నాయ్.

మరీ ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఎదుర్కొనే సమస్యల్లో  జీర్ణ సమస్యలు కూడా ప్రధానమైనవే. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.

అలాగే, కడుపులో యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు వేధించే ప్రమాదముంది. అంతేకాదు, ప్రొటీన్ శోషణ కూడా సక్రమంగా జరగదు. తద్వారా శరీరం తగినన్ని ప్రొటీన్లను తీసుకోలేదు. దాంతో విపరీతమైన నీరసం, అలసట, అసహనం వేధిస్తుంటాయ్.

ఒత్తిడిని తట్టుకోవడానికి కాస్తయినా వ్యాయామం చేయడం, లేదా మొక్కలు, చెట్లతో కాలక్షేపం చేయడం, అలాగే అప్పుడప్పుడూ వెకేషన్లకు వెళ్లడం వంటివి చేస్తుండాలి. అలాంటివి చేయడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గి రిఫ్రెష్‌మెంట్ వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com