లండన్ లో మెగా ఫ్యామిలీ వెకేషన్
- July 24, 2024
లండన్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కలిసి లండన్ లో విహారయాత్ర చేస్తున్నాడు. అయితే ఈ వెకేషన్ లో ఆయనతో పాటు రామ్ చరణ్ దంపతులు, మనవరాలు కూడా ఉంది. తాజాగా లండన్ లోని హైడ్ పార్క్ లో నలుగులూ కలిసి వాకింగ్ చేస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. అయితే ఇది రిలాక్సేషన్ కోసం వెళ్లిన వెకేషన్ కాదు. మెగాస్టార్ కు లండన్ లో ప్రారంభం కాబోతోన్న ఒలింపిక్స్ ఇనాగరల్ ఈవెంట్ కు ఇన్విటేషన్ వచ్చింది. అందుకోసమే అక్కడికి వెళ్లాడు. పనిలో పనిగా కొడుకు కోడలు, మనవరాలిని తీసుకువెళ్లాడు. అయితే ఈ ఫోటోలో మనవరాలి ఫేస్ ను మరోసారి కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక సినిమాల పరంగా చిరు ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలతో పాటు క్లైమాక్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇటు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాకు సిద్ధం అవుతున్నాడు. గేమ్ ఛేంజర్ కు సంబంధంచి ఆయన పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో.. కాస్త గ్యాప్ ఉంది. అందుకే ఈ వినోద యాత్ర అన్నమాట.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
Summer Olympics 24 Inaugural Event Beckons :) pic.twitter.com/bFa31zBh3a
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







