పీఎం ఉచిత గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందాలనుకుంటున్నారా..?

- July 25, 2024 , by Maagulf
పీఎం ఉచిత గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందాలనుకుంటున్నారా..?

న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 25 జూన్ 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద నిరాశ్రయులైన ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ప్రయోజనం పొందుతారు.

దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాను http://rhreporting.nic.inలో చూడవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ అర్హతలుండాలి.. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు. దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు పేరు తప్పనిసరిగా రేషన్ కార్డు లేదా PBL జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారు తన పేరును ఓటర్ల జాబితాలో ఉంచడం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉండాలి.

వీటితో పాటు.. దరఖాస్తుదారుడు ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్, ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్ బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. వీటితో పాటు.. మొబైల్ నంబర్ ఉండాలి. దీనికి దరఖాస్తు చేసే సమయంలో ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి దరఖాస్తులను సమర్పించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా.. మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోతే, మీరు పైన పేర్కొన్న అన్ని పత్రాలతో పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్‌ని సందర్శించడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రక్రియ క్రింది విధంగా ఉంది.

ముందుగా మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ ( https://pmaymis.gov.in ) సందర్శించాలి . ఆ తర్వాత. వెబ్‌సైట్ యొక్క ప్రధాన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ “Awaassoft” పై క్లిక్ చేయాలి.

ఆపై మరొక జాబితా ఓపెణ్ అవుతుంది. అందులో మీరు “డేటా ఎంట్రీ” పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అందులో మీరు “DATA ENTRY FOR AWAAS”ని ఎంచుకోవాలి. మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని, “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయాలి. ఆపై మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి, “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత “బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం” మీ ముందు ఓపెన్ అవుతుంది.

అందులో మీరు మొదటి విభాగంలో మీ “వ్యక్తిగత వివరాలు” సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత రెండవ విభాగంలో “బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు” నింపండి. మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ్ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్ (SBM నంబర్) వంటి “బెనిఫిషియరీ కోఆర్డినేషన్ వివరాల” సమాచారాన్ని నమోదు చేయాలి.

బ్లాక్ వారీగా నింపాల్సిన నాల్గవ విభాగంలో, మీరు “సంబంధిత కార్యాలయం ద్వారా పూరించిన వివరాలు”కి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి. ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా PM ఆవాస్ యోజన ఫారమ్‌ను పూరించవచ్చు. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాను http://rhreporting.nic.inవెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com